ఈ పుట్టగొడుగును ముట్టుకుంటే మటాషే!

ఈ పుట్టగొడుగును ముట్టుకుంటే మటాషే!

ఎర్రగా, నిగనిగలాడే క్యారెట్ లా మస్త్ ఉంది కదా.. అని దీనిని ముట్టుకున్నారో.. ఇక మీ పని అయిపోయినట్టే! ఎందుకంటే.. ఇది క్యారెట్ కాదు. అలాంటి దుంప కూడా కాదు. ఇది ప్రపంచంలోనే ‘మోస్ట్ డెడ్లీయెస్ట్’ పుట్ట గొడుగు మరి! పాయిజన్ ఫైర్ కోరల్ అనే ఈ ఫంగస్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లో ఇటీవల జేమ్స్ కుక్ యూనివర్సిటీ సైంటిస్టుల కంట పడింది. దీనిని తినవద్దని, కనీసం ముట్టుకోవద్దని వారు ప్రజలను హెచ్చరించారు.  ఇప్పటివరకూ పుట్ట గొడుగుల్లో వంద రకాల విషపూరితమైన జాతులను సైంటిస్టులు గుర్తించారు. ఇంకా గుర్తించనివి ఎన్నో ఉంటాయని చెబుతారు.వీటన్నింటిలోనూ ఇదే మోస్ట్ డేంజరస్ పుట్ట గొడుగట! దీనిని ముట్టుకుంటే ఏకంగా 8 రకాల విషాలు మన చర్మం నుంచే బాడీలోకి చేరుతాయట.ఇది జపాన్, కొరియా పర్వతాల్లో ఎక్కువగా ఉంటుంది. జపాన్, కొరియాల్లో పలువురు దీనిని ఔషధ మొక్కగా భావించి చాయ్ లో వేసుకుని తాగి చనిపోయారట. అయితే, ఆస్ట్రేలియాలో దీనిని చూడటం ఇదే తొలిసారని, వర్సిటీ సైంటిస్ట్ మాట్ బ్యారెట్ చెప్పారు. తాను 2018 నుంచి ఇక్కడ 20 కొత్త ఫంగస్ జాతులను గుర్తించానన్నారు. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయో చూడాలన్నారు.

ముట్టుకుంటే ఏమైతది? 

పాయిజన్ ఫైర్ కోరల్ ను ముట్టుకున్నపుడు చర్మానికి తగిలితే  చర్మం ఎర్రగా కంది వాస్తుంది.  తిన్నారంటే.. మొదట కడుపు నొప్పి వస్తుంది. వాంతులవుతాయి. ఫీవర్ వస్తది. మత్తు ఆవరిస్తది. కొన్ని గంటల నుంచి రోజుల వరకూ ఈ ఎఫెక్ట్స్ ఉంటది. తర్వాత చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం ఊడిపోతది. మెదడు ముడుచుకుపోతది. చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాదు. మాటలు తడబడతాయి. కదిలేందుకూ కష్టమవుతుంది. చివరగా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.