సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు ధావన్ ను ఎంపిక చేస్తారా?

సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు ధావన్ ను ఎంపిక చేస్తారా?

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌కు వన్డే టీమ్‌‌‌‌లో ప్లేసుందా ?  గబ్బర్‌‌‌‌ను సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు ఎంపిక చేస్తారా? ప్రొటీస్‌‌‌‌ టీమ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి మదిలో ఉన్న ప్రశ్నలివి. టీమిండియా వన్డే కెప్టెన్‌‌‌‌గా రోహిత్‌‌‌‌ శర్మను ప్రకటించిన సెలెక్టర్లు మిగిలిస టీమ్‌‌‌‌ను  ఒకట్రెండు రోజుల్లో ఎంపిక చేయనున్నారు. అయితే, రోహిత్‌‌‌‌కు జోడీగా బరిలోకి దిగే మరో ఓపెనర్‌‌‌‌ ఎవరనే దానిపై సెలెక్టర్లు కసరత్తు చేయాల్సి ఉంది. ఈ ప్లేస్‌‌‌‌ కోసం సీనియర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ మధ్య గట్టి పోటీ ఉండటమే ఇందుకు కారణం. శ్రీలంక టూర్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌గా, బ్యాటర్‌‌‌‌గా సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయిన ధవన్‌‌‌‌ ఇటీవల ఫామ్‌‌‌‌ కోల్పోయాడు.  ఐపీఎల్‌‌‌‌లో ఆకట్టుకున్న గబ్బర్‌‌‌‌... ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌‌‌‌ హజారే వన్డే టోర్నీలో ఫెయిలయ్యాడు. నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో వరుసగా  0, 12, 14, 18 స్కోర్లు చేశాడు. అదేటైమ్‌‌‌‌లో  గైక్వాడ్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను విజయ్‌‌‌‌ హజారేలోనూ కొనసాగిస్తున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌లో మూడు సెంచరీలు బాదాడు.  శ్రీలంక సిరీస్‌‌‌‌లో  ధవన్‌‌‌‌ కెప్టెన్సీలోనే ఇంటర్నేషనల్‌‌‌‌ డెబ్యూ చేశాడు తను. ఆ సిరీస్‌‌‌‌లో రెండు మ్యాచ్‌‌‌‌లు ఆడిన గైక్వాడ్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌తో జరిగిన టీ20 సిరీస్‌‌‌‌కు ఎంపికైనా ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి రాలేకపోయాడు. ప్రస్తుత ఫామ్‌‌‌‌ ప్రకారం గైక్వాడ్‌‌‌‌ను సెలెక్టర్లు పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు.  ఇంజ్యురీకి గురైన కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ కూడా సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులోకి వస్తే  మూడో ఓపెనర్‌‌‌‌గా గైక్వాడ్‌‌‌‌ను ఎంపిక  చేసే చాన్స్‌‌‌‌ ఎక్కువ ఉంది.  కేఎల్‌‌‌‌ లేకపోతే మాత్రం సీనియర్‌‌‌‌ కోటాలో గబ్బర్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ దొరకవచ్చు. మరోపక్క,  ఫామ్‌‌‌‌ కోల్పోయిన సీనియర్లు చతేశ్వర్‌‌‌‌ పుజారా, అజింక్యా రహానె, ఇషాంత్ శర్మకు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌  సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌‌‌లో అవకాశమిచ్చాడు. వన్డే టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌లోనూ ఇదే ఫార్ములా ఫాలో అయితే ధవన్‌‌‌‌కు జట్టులో స్థానం గ్యారంటీ. ఇక, ఐపీఎల్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. న్యూజిలాండ్‌‌‌‌తో జరిగిన టీ20 సిరీస్‌‌‌‌లో బరిలోకి దిగిన అయ్యర్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా తన సత్తా ఏంటో చూపెట్టాడు. విజయ్‌‌‌‌ హజారేలో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. హార్దిక్‌‌‌‌ పాండ్యా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై సస్పెన్స్‌‌‌‌ కూడా ఉండటంతో పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కోటాలో వెంకటేశ్‌‌‌‌ వన్డే టీమ్‌‌‌‌ పిలుపు అందుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. అవసరమైతే ఓపెనర్‌‌‌‌గా ఆడే సత్తా ఉండటం వెంకటేశ్‌‌‌‌కు అడ్వాంటేజ్‌‌‌‌ కానుంది. మరి, శిఖర్‌‌‌‌, గైక్వాడ్‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌ విషయంలో సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.