ఫైనల్లో నిఖత్

ఫైనల్లో నిఖత్

అస్తానా (కజకిస్తాన్‌‌‌‌) : ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌‌‌ ఎలోర్డా కప్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు మరో ముగ్గురు విమెన్‌‌‌‌ బాక్సర్లు ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన 52 కేజీ సెమీఫైనల్ బౌట్‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌ నిఖత్ 5–0తో కజకిస్తాన్‌‌‌‌కు చెందిన టొమిరిస్‌‌‌‌ మిర్జాకుల్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది.

హైదరాబాద్ స్టార్ పంచ్‌‌‌‌లకు ప్రత్యర్థి మూడు రౌండ్లలోనూ చేతులెత్తేసింది. 48 కేజీ సెమీస్‌‌‌‌లో మీనాక్షి 5–0 గుల్నాజ్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌),60  కేజీ బౌట్‌‌‌‌లో మనీషా 5–0తో టంగటర్‌‌‌‌‌‌‌‌ అసీమ్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌)ను చిత్తు చేశారు. 50 కేజీ బౌట్‌‌‌‌లో అనామిక  ముందంజ వేసింది.

బౌట్‌‌‌‌లో ప్రత్యర్థి గుల్నార్ టురాబే (కజకిస్తాన్‌‌‌‌)  మూడుసార్లు వార్నింగ్‌‌‌‌ అందుకోవడంతో  మ్యాచ్‌‌‌‌ ఆపిన రిఫరీ అనామికను విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించారు. మరోవైపు సోను (63కేజీ), మంజు బంబోరియా (66 కేజీ) సెమీస్‌‌‌‌ బౌట్లలో ఓడి  బ్రాంజ్ మెడల్స్‌‌‌‌తో సరిపెట్టారు. శనివారం ఫైనల్స్ జరగనున్నాయి