క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌-చిరాగ్

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌-చిరాగ్

–బ్యాంకాక్‌‌‌‌ : థాయ్‌‌‌‌లాండ్ ఓపెన్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌లో  ఇండియా  డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన  మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్రి క్వార్టర్స్‌‌‌‌లో టాప్ సీడ్ సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 21–16, 21–11 జి హవో నాన్‌‌‌‌–జెంగ్‌‌‌‌ వీ హన్ (చైనా) ద్వయంపై వరుస గేమ్స్‌‌‌‌లో గెలిచారు. విమెన్స్ డబుల్స్‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌ తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–19, 21–17తో  జు హుంగ్ ఎన్‌‌‌‌–లలిన్ యు పీ (చైనీస్‌‌‌‌ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ చేరారు.

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ మైరబా లువాంగ్‌‌‌‌ మైస్నమ్‌‌‌‌ 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫర్సేన్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌లో అడుగుపెట్టాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అష్మితా చాలిహా 15–21, 21–12, 12–21తో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ హన్ యుయె (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. డబుల్స్‌‌‌‌లో రుతపర్ణ పండ–శ్వేతపర్ణ పండ, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌–ఆద్య ప్రిక్వార్టర్స్‌‌‌‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు.