హైదరాబాద్ తిరిగేద్దాం! సిటీ సందర్శనకు స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్ తిరిగేద్దాం! సిటీ సందర్శనకు స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్ అనేక చారిత్రక కట్టడాలకు నిలయం. నిజాం నవాబుల కాలంలో రూపొందించిన ఎన్నో కట్టడాలు, సుందరమైన పార్కులు, భాగ్యనగర అందాన్ని మరింత పెంచుతుంటాయి. ఎంతో మంది బయటి ప్రాంతాల నుంచి సందర్శించడానికి ఇక్క డికి వస్తుంటారు. అలాంటి వారి కోసం‘ప్రతి రోజు నగర సందర్శన’ అనే ప్యాకేజీ ని టూరిజం శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్యాకేజీ ఉదయం గం.7.30 నుంచి రాత్రిగం.7.30 దాకా ఉంటుంది. ఇందులో బిర్లా మందిర్, చౌమహల్లా ప్ యాలెస్, చార్మినా ర్(కాలినడక), నిజాం మ్యూజియం (పురానీహవేలి), సాలార్ జంగ్ మ్యూజియం,గోల్కొండ కోట ( దారిలో కుతుబ్ షాహి సమాధులు), లుంబినీ పార్క్ ఉంటాయి.నాన్ ఏసీ కోచ్ లో పెద్దలకు రూ .250,పిల్లలకు రూ .200.. ఏసీ కోచ్ లో అయితేపెద్దలకు రూ .350, పిల్లలకు రూ . 280 చార్జితీసుకుంటారు. దీనికి తోడు ఎంట్రీ టికెట్లకు అదనంగా పైసలు ఇవ్వాల్సి ఉంటుంది.

వీటితో పాటు ‘నిజాం ప్యాలెస్ సందర్శన’అనే ప్ యాకేజీ కూడా అందుబాటులో ఉంది.ఇది కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఉంటుం ది. మధ్యాహ్నం  ఒంటి గంట నుంచి రాత్రి 9గంటల వరకు ఈ ప్ యాకేజ్ టైమింగ్స్.ఇందులో చౌమహల్లా ప్ యాలెస్, ఫలక్నుమాప్ యాలెస్, గోల్కొండ కోటలో సౌండ్లైట్ ప్రదర్శన చూపిస్తారు. పెద్దలకు రూ .2వేలు, పిల్లలకు రూ .1850, ఏసీ ట్రాన్స్ పోర్ట్ తో పాటు ఎంట్రీ ఫీజులు కూడా ఇందులో కలిపి ఉంటాయి. ఫలక్ నుమా ప్యాలెస్ లోహైటీతో కలిపి పెద్దలకు రూ .3100, పిల్లలకు రూ.2480 తీసుకుంటారు .

సిటీ అవుట్ స్కర్స్ట్ లో టూరిజం స్పాట్స్

సాగరం చుట్టూ పక్కల పచ్చని తివాచీ పరిచినట్టు గా అడవులు, చెరువులు, దేవాలయాలు మనసుకి ప్రశాంతత, ఆహ్లాదాన్ని కలిగిస్తా యి. ముఖ్యంగా వికారాబాద్ లోని చెరువులు, అడవులు, అనంతగిరి హిల్స్ ఎంతో అందంగా ఉంటాయి. టూరిజం శాఖ వికారాబాద్, అనంతగిరి హిల్స్ కి రెండ్రోజుల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది.ఈ యాత్ర శుక్ర, శనివారాల్లో మాత్రమే ఉంటుం ది. సాయంత్రం 5గంటలకు మొదలయ్యే యాత్ర మరుసటి రోజు రాత్రి 8గంటలకు ముగుస్తుం ది. ఇందులో భాగంగా  చిల్కూరు బాలాజీ దేవాలయం, ట్రెక్కింగ్, అనంతపద్మనాభ స్వామి ఆలయం (అనంతగిరిలోరాత్రి బస) ఉంటాయి. పెద్దలకు రూ .2490,పిల్లలకు రూ . 2000 ఏసీ ట్రాన్స్ పోర్ట్, ఏసీ అకామిడేషన్ లో ప్యాకేజీ ధరలున్నాయి