ఔటర్ ఎగ్జిజ్ పాయింట్ల లో ట్రాఫిక్ జామ్

 ఔటర్ ఎగ్జిజ్ పాయింట్ల లో ట్రాఫిక్ జామ్
  •     ఒక్కో చోట 60 కిపైగా వెహికల్స్ బారులు
  •     టోల్​కౌంటర్లు పెంచని సంస్థ
  •     పట్టించుకోని అధికారులు 

 హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ పెరుగుతుంది. ఎగ్జిట్లు రెండు మాత్రమే ఉండగా వెహికల్స్​జామ్​అయ్యే పరిస్థితి ఉంది. ఓఆర్ఆర్ పైకి వెళ్లే వెహికల్స్​పెరుగుతుండటం, ఎగ్జిట్స్ టోల్ ప్లాజాల వద్ద  రెండు  లేన్లు మాత్రమే ఉంటుండగా సమస్య పెరుగుతూ ఉంది.  ఒక్కోసారి 50 నుంచి 60 వాహనాలు క్యూ కడుతున్నాయి.   ఓఆర్ఆర్ పై డైలీ1.40 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పై 22 ఇంటర్‌ చేంజ్‌ల వద్ద టోల్‌ వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఓఆర్ఓర్ ని  రూ.7,380 కోట్లకు 30ఏళ్ల పాటు టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ (టీఓటీ)పద్ధతిలో ఐఆర్బీ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లీజుకిచ్చింది. అయితే ఎగ్జిట్ పాయింట్ల వద్ద సమస్య తీరాలంటే సంస్థ తీరుపై హెచ్ఎండీఏ అధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. 

22 ఎంటర్​చేంజ్ ల్లో మాత్రమే..

శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల, బొంగులూర్, పెద్ద అంబర్​పేట్​, తారామతిపేట్​, ఘట్ కేసర్, కీసర, శామీర్​పేట్​, కండ్లకోయ, సారేగూడెం, సుల్తాన్ పూర్, పఠాన్​ చెరువు, ఎదుల నాగులపల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, టీఎస్​పీఏ, రాజేంద్రనగర్, నార్సింగి, కోకాపేట్, మల్లంపేట్ ఇంటర్ చేంజ్ ల వద్ద టోల్ వసూల్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఓఆర్​ఆర్​ పైకి ఎక్కేందుకు, దిగేందుకు ఇరువైపులా కొన్ని చోట్ల మినహా మిగతా అంతటా టోల్​ప్లాజాలు ఉన్నాయి. ఎక్కువగా ఎగ్జిట్​ల వద్దనే సమస్య కనిపిస్తుంది.  పఠాన్​ చెరువు, గచ్చిబౌలి లాంటి పెద్ద టోల్​ప్లాజాల వద్ద ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ చిన్న ఎగ్జిట్లలో కూడా ఒక్కోసారి ఆలస్యమవుతుంది.  టీఎస్​పీఏ వద్ద ఎగ్జిట్ టోల్ వద్ద ఏ లేన్ లో వెళ్లిన కూడా అనుమతిస్తుండటంతో చాలా ఆలస్యమవుతుంది. ఇలా తక్కువ లేన్లు ఉన్న వద్ద ఒక్కోసారి ఆలస్యమవుతుంది. 

ఫాస్టాగ్ లేన్ లోకి వస్తుండగా.. 

ఫాస్టాగ్​వాడకంపై ఓఆర్ఆర్ పై అవేర్ నెస్​ కల్పించడంలేదు. ఫాస్టాగ్​ లేకుండా ఓఆర్ఆర్ పైకి వచ్చే వాహనాలకు కనీసం ఏర్పాటు చేసుకోవాలని కూడా అక్కడ సిబ్బంది చెప్పడం లేదు. మొదట్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో ఫాస్టాగ్ లేని వారు కూడా ఫాస్టాగ్ లేన్లలో వస్తూ ఇతరుల సమయాన్ని వృథా చేస్తున్నారు. కొన్ని టోల ప్లాజాల వద్ద రెండు కౌంటర్లలో ఒక్కో సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. ఫాస్టాగ్ దాంట్లో ఎవరు కనిపించడంలేదు. దీంతో ఫాస్టాగ్ లేన్ లోకి క్యాష్ చెల్లించేవారు వస్తుండటంతో కూడా జామ్ ఏర్పడుతుంది. ఫాస్టాగ్ లోకి కేవలం ఫాస్టాగ్ వాహనాలు మాత్రమే వస్తే ఇబ్బందులు తప్పనున్నాయి.