ఇన్​కమింగ్​ కాల్​ రింగ్​ 30 సెకన్లు మోగాల్సిందే

ఇన్​కమింగ్​ కాల్​  రింగ్​ 30 సెకన్లు  మోగాల్సిందే

కోల్‌‌కతా : మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ నిర్దేశించింది. ల్యాండ్‌‌లైన్స్‌‌కు చేసే కాల్స్‌‌కు 60 సెకన్లు ఉండాలని ట్రాయ్ పేర్కొంది. రిలయన్స్ జియో ఈ డ్యూరేషన్‌‌ 15 నుంచి 20 సెకన్లు మాత్రమే ఉండాలని కోరింది. వొడాఫోన్ ఐడియా ఈ రింగ్ సమయం 30 సెకన్లు, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌లు 45 సెకన్లు ఉండాలని కోరాయి. చివరికి ట్రాయ్ వొడాఫోన్ ఐడియా నిర్ణయానికే జై కొట్టింది. దీంతో టెల్కోల మధ్య ఎప్పటినుంచో జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్‌‌స్టాప్ పడింది. కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా.. ఇన్‌‌కమింగ్ వాయిస్ కాల్స్‌‌ అలర్ట్‌‌కు ఈ టైమ్ డ్యూరేషన్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆపరేటర్లకు తెలిపింది. ఇప్పటి వరకు రింగ్ సమయం విషయంలో ఎలాంటి పరిమితులూ లేవు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి