వర్చువల్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాల్​ చేసి ట్రేడింగ్ పేరుతో ట్రాప్

వర్చువల్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాల్​ చేసి ట్రేడింగ్ పేరుతో ట్రాప్
  • ట్రేస్ చేయడం కష్టమే
  • అలర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

‘‘కొన్నిరోజుల క్రితం  యూఎస్ సిరీస్​ఫోన్ నంబర్​తో ఇంటర్నెట్ కాల్ వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్​లో రూ.లక్షకుపైగా ఇన్వెస్ట్ చేయమన్నారు.  అనుమానంతో తిరిగి వారికి కాల్‌‌‌‌‌‌‌‌ చేస్తే కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అవలేదు. ఫ్రాడ్​ కాల్​గా గుర్తించి ఆ నంబర్ ను డీటెయిల్స్‌‌‌‌‌‌‌‌తో మా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ వాట్సాప్​ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో పోస్టు చేసి వారిని అలర్ట్ చేశా’ అని సిటీకి చెందిన ఓ ఐటీ ఎంప్లాయ్ తెలిపాడు.

హైదరాబాద్,వెలుగు: సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు రోజురోజుకి రూట్​ మార్చుతూ కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్చువల్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫారిన్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకొని ట్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల లిమిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసుల్లో 62 శాతం సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలు వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులతో మోసాలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. గత రెండేండ్లుగా నమోదైన కేసుల డేటా ఆధారంగా కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్, ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్చవల్ ఫోన్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి. కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింకైన నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఇలాంటి  వర్చువల్ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చి మాట్లాడవచ్చు. అదే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాయిస్ కాల్స్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాల్స్ చేసే అవకాశాలున్నాయి. ఫ్రీ వర్చువల్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాలింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనెక్ట్  అవుతున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన కోడ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరుకుతోంది.

డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డిలీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
కాలింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకునే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండదు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉండే కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రపంచంలో ఎవరైనా వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.  ఒకరు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న నంబర్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరొకరు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకునేంత వరకు యూజ్ చేయొచ్చు. ఇలాంటి నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరొకరు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వెంటనే డీ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డీ యాక్టివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ఇలాంటి నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

లక్షల్లో కాలింగ్ యాప్స్
ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వర్చువల్ కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూఎస్, యూకే, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇంటర్నేషనల్ సిరీస్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నేరాలకు పాల్పడడంతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కిడ్నాప్ కేసుల్లో కాలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.