TRS ఎమ్మెల్యే కొడుకుపై గుర్రుగా ఉన్న సీనియర్లు

TRS ఎమ్మెల్యే కొడుకుపై గుర్రుగా ఉన్న సీనియర్లు

కొత్తగూడెం  ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు  కుమారుడు  వనమా రాఘవేంద్ర  తీరు  మరోసారి  వివాదస్పదమైంది. స్థానికంగా  షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడన్న  ఆరోపణలకు  బలం చేకూరుస్తూ  మరో ఘటన వెలుగు చూసింది. డీపీఆర్వో  ద్వారా ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో  ప్రెస్ మీట్ ఉందని మీడియాకు  సమాచారం అందింది.  ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో కూర్చోని    ఎమ్మెల్యే అధికారికంగా  వెల్లడించాల్సిన  విషయాలను… రాఘవేంద్ర మీడియాతో  చెప్పాడు. రాఘవేంద్ర  తీరుపై  స్థానిక  టీఆర్ఎస్ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. సీనియర్  నాయకులు, హోదా కలిగిన వారిని పక్కన  పెట్టి  పార్టీ  సభ్యత్వం కూడా  లేని వారు  అధికారికంగా  ప్రెస్ మీట్ నిర్వహించడం  ఏంటని ప్రశ్నిస్తున్నారు.