హెచ్–4 వీసా హోల్డర్ల‌ వర్క్ పర్మిట్లు బ్లాక్ చేయొద్దు

హెచ్–4 వీసా హోల్డర్ల‌ వర్క్ పర్మిట్లు బ్లాక్ చేయొద్దు

 ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును కోరిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్

వాషింగ్టన్: హెచ్–4 వీసా హోల్డర్‌ల‌ వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరింది. వారి వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ఎలాంటి సమస్య లేదని తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో డిపార్ట్​మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ రిపోర్టు సబ్మిట్ చేసింది. హెచ్–1బీ వీసా హోల్డర్ల భార్య/భర్తకు, 21 ఏళ్ల లోపు పిల్లలకు హెచ్–4 వీసాలను యూఎస్ సిటిజన్​షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) జారీ చేస్తుంది. హెచ్–4 వీసాలు ఉన్న వాళ్లకు అక్కడ పని చేసేందుకు అనుమతి ఉంది. అయితే అమెరికాలో శాశ్వత నివాసాన్నిచ్చే ‘గ్రీన్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు మాత్రమే ఇలా పనిచేసేందుకు చాన్స్ ఉంది. ఇలా పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఇండియన్లే ఉన్నారు. తర్వాతి స్థానంలో చైనా వాళ్లు ఉన్నారు.