డేంజర్ అని తెలిసినా.. కరోనాను తక్కువ అంచనా వేశా

డేంజర్ అని తెలిసినా.. కరోనాను తక్కువ అంచనా వేశా

వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చివరికి దిగొచ్చారు. ‘‘నాకు కరోనా గురించి అంతా తెలుసు. పరిస్థితి ఘోరంగా మారబోతోందని తెలిసినా డౌన్ ప్లే చేశాను. నేను అందరి దృష్టిలో చెడ్డవాడిగా ఉండిపోకూడదనే ఇప్పుడు చెబుతున్నా. వచ్చే రెండు వారాలు చాలా కీలకం. ఇది ప్లేగుతో సమానం. ప్రతి అమెరికన్ కరోనాను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు. అమెరికాకు మెయిన్ కార్పొరేట్ సెంటర్లయిన న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరగడంతో ట్రంప్​ మాట్లాడారు. ‘ప్రజలు నిరాశపడకుండా చీర్ లీడర్​లా ఉండాలనుకున్నా. ఏమీ కాదులే అని చెప్పడం లేదు. కానీ అమెరికన్లలో ఆశలు నిలబెట్టాలి.” అని పేర్కొన్నారు.

రెండు నెలలు వేస్ట్​ చేశారు

అమెరికాలో ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు జనవరి 21న బయటపడింది. మహమ్మారిలా మారే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ట్రంప్ చెవిలో పోరు పెట్టాయి. అయినా ట్రంప్​ అంతా బాగానే ఉందన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘సైంటిఫిక్ అడ్వైజ్​లను కూడా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు. రెండు నెలలు వేస్టుగా గడిచిపోయాయి’’ అని హర్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ ఝా అన్నారు. అంతా అదుపులోనే ఉందంటూ ట్రంప్ జనాల్ని మభ్యపెట్టారని, పరిస్థితి ముంచుకొస్తోందని శ్రద్ధ పెట్టలేదని మండిపడ్డారు.

‘స్టే ఎట్​హోం’ ఆర్డర్లు లేవు

అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో వేలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. అయినా.. ఇప్పటికీ చాలా రాష్ట్రాల గవర్నర్లు మాత్రం ‘స్టే ఎట్ హోం’ఆర్డర్లను జారీ చేయడం లేదు. అమెరికాలో మొత్తం 52 రాష్ట్రాలు ఉండగా, ఇప్పటివరకూ 30 రాష్ట్రాలు మాత్రమే ఈ ఆర్డర్లను జారీ చేశాయి. దేశవ్యాప్తంగా ఈ ఆర్డర్లను జారీ చేయాలని వైట్ హౌజ్ ఇదివరకే స్పష్టం చేసింది. కానీ ఈ ఆర్డర్లను రాష్ట్రాల గవర్నర్లు జారీ చేయాల్సి ఉండగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డేశాంటిస్ తో సహా చాలా మంది గవర్నర్లు పట్టించుకోవడం లేదట.

సెన్సస్ బ్యూరో ఆపరేషన్లు బంద్

అమెరికాలో బుధవారం సెన్సస్ డే. పదేళ్లలో ఒకసారి వచ్చే రిఫరెన్స్ తేదీ ఇది. కానీ మామూలుగా అయితే ఈ రోజున దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరించే అధికారుల హడావుడి ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా దేశమంతా స్తంభించిపోయింది. అయితే, జనాభా లెక్కలను పూర్తి చేసేందుకు డిసెంబర్ 31 దాకా గడువు ఉందని, ఆలోగా పని పూర్తి చేస్తామని సెన్సస్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం యూఎస్ సెన్సస్ బ్యూరో నెలరోజుల పాటు ఫీల్డ్ ఆపరేషన్లను రద్దు చేసింది. ఏప్రిల్ 15 తర్వాత 5 లక్షల మంది జనాభా లెక్కల సేకరణకు టెంపరరీ సిబ్బందిని నియమించుకోవాలని యోచిస్తోంది.

గాంధీకి పోటెత్తిన ‘మర్కజ్’ అనుమానితులు

కరోనా వయా మలేషియా టూ ఢిల్లీ, తెలంగాణ