రష్యన్ ఆయిల్ హబ్‌‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి

రష్యన్ ఆయిల్ హబ్‌‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి

కీవ్‌‌: రష్యాలోని ఆయిల్ రిఫైనింగ్ హబ్‎గా పేరొందిన నిజ్నెకామ్స్క్ సిటీపై ఉక్రెయిన్ భారీ డ్రోన్‌‌ దాడికి తెగబడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ అటాక్‌‌లో ఓ చిన్నారితో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ బార్డర్‌‌‌‌కు దాదాపు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నెకామ్స్క్ సిటీలో రెండు ప్రధాన రిఫైనరీలతో పాటు ఓ పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. 

ఇరు దేశాల మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఇటీవల డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడుతోంది. సొంతంగా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్లను తయారు చేసుకుని రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు చేస్తోంది. ఈ దాడులతో రష్యాలో ఇంధన కొరత తలెత్తి, అక్కడి ప్రజల్లో అశాంతి వ్యక్తమవుతోంది. నిజ్నెకామ్స్క్ నగరంపై దాడి కూడా ఇందులో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది.