శ్రీలంకలో ఉగ్ర మారణ హోమం.. ఇదీ నష్టం

శ్రీలంకలో ఉగ్ర మారణ హోమం.. ఇదీ నష్టం

శ్రీలంకలో ఈ ఉదయం నుంచి 8సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. పలుచోట్ల బాంబులు.. పలుచోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. చివరిసారి జరిగిన దాడి ఆత్మాహుతి దాడిగా అధికారులు నిర్ధారించారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడులు చేశారు. కొలంబోలోని ఓ చర్చి, 3 లగ్జరీ హోటల్స్, కొలంబోకు అవతల ఉన్న మరో రెండు చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు టెర్రరిస్టులు.

శ్రీలంకలో ఆదివారం సాయంత్రం వరకు ఉగ్రవాద మారణ హోమం వివరాలు

ఎన్నిచోట్ల.. ఎన్ని పేలుళ్లు : 6 చోట్లు… 8 బాంబు పేలుళ్లు

ఎంతమంది మృతి : 166మందికి పైగా మృతి

గాయపడింది ఎంతమంది : 400కు పైగా ప్రజలకు గాయాలు

చనిపోయిన ఫారినర్స్ :  మృతుల్లో 35 మంది విదేశీయులు

పేలుళ్లు జరిగిన చర్చిలు :  సెయింట్ ఆంటోనీస్ చర్చ్ – కొచికడే-కొలంబో, సెయింట్ సెబాస్టియన్ చర్చ్-నెగొంబో, ద జియాన్ చర్చ్- బట్టికలోవా

హోటల్స్ : షాంగ్రీ లా, సిన్నమొన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్