కరోనా పేషెంట్​కు ట్రీట్​మెంట్​.. బిల్లు రూ.8.5 కోట్లు

కరోనా పేషెంట్​కు ట్రీట్​మెంట్​.. బిల్లు రూ.8.5 కోట్లు

వాషింగ్టన్: కరోనాకు ట్రీట్​మెంట్ తీసుకుని కోలుకున్న ఓ వ్యక్తికి ఆస్పత్రి బిల్లు చూశాక కోమాలోకి వెళ్లినంత పనైంది. అమెరికాలోని వాషింగ్టన్ లో మైఖేల్ అనే 70 ఏళ్ల పెద్దాయన అనారోగ్యంతో ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేరాడు. కరోనా సోకినట్లు కన్ఫామ్ కావడంతో డాక్టర్లు స్పెషల్ ట్రీట్​మెంట్ స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే కండిషన్ సీరియస్ కావడంతో ఐసీయూలో.. వెంటిలేటర్ పై ఉంచారు. అయినా లాభం లేకపోయేసరికి కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన ట్రీట్​మెంట్ కి స్పందించడం… కోలుకుని ఆరోగ్యంగా బయపడటం జరిగిపోయింది. అదృష్టవశాత్తు మైఖేల్ కోలుకున్నారని కుటుంబ సభ్యులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన బిల్లు చూసి షాక్ తినక తప్పలేదు వారికి.

ట్రీట్​మెంట్ చేసినందుకు గాను హాస్పిటల్ మేనేజ్​మెంట్..పేషెంట్​కు 181 పేజీల బిల్లును చేతిలో పెట్టింది. 42 రోజుల పాటు ఐసీయూలో ఉంచినందుకు రోజుకు 9,736 డాలర్ల చొప్పున, 29 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచినందుకు రోజుకు 82,000 డాలర్ల చొప్పున, స్పెషల్ ట్రీట్​మెంట్​కు రెండు రోజులకు గాను రోజుకు లక్ష డాలర్ల చొప్పున బిల్లు వేసింది. ఇవన్నీ కలిపి మొత్తం ఏకంగా.. 1,122,501 (1.1 మిలియన్ డాలర్లు) బిల్లు కట్టాల్సి ఉంటుందని సూచించింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.5 కోట్లు. అయితే.. ఈ బిల్లు పేషెంట్లు కట్టనక్కరలేదని, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే బీమా సదుపాయం ఉడటంతో బిల్లు సర్కారే చెల్లింస్తుందని ఆస్పత్రి వర్గాలే చెప్పడం గమనార్హం.