అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హామీతో భారత్‌కు వెంటిలేటర్లు రానున్నాయి. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ.. భారత్‌కు 200 వెంటిలేటర్లు విరాళం ఇవ్వనున్నట్లు తెలిసింది. రాబోయే నెల రోజుల్లో ఆ వెంటిలేటర్లు మనకు అందనున్నాయి. మే, జూన్ నెలల్లో.. రెండు దఫాల్లో వెంటిలేటర్లు భారత్ కు రానున్నాయి. యూఎస్ ఎయిడ్ నిధుల కింద వెంటిలేటర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా అవసరాల కోసం వెంటిలేటర్లు తయారు చేశారు. ఇతర దేశాలు కూడా ఆ వెంటిలేటర్లు వాడుకునే విధంగా మారుస్తున్నారు. అయితే విరాళంలో భాగంగా కొన్నింటిని ఇండియాకు పంపిస్తున్నట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీగ్ మెకన్నీ తెలిపారు.

