చైనాలో కుంగిన హైవే..గుంతలో పడ్డ వాహనాలు.. 24 మంది మృతి

చైనాలో కుంగిన హైవే..గుంతలో పడ్డ వాహనాలు.. 24 మంది మృతి

బీజింగ్ : చైనాలో ఘోరం జరిగింది. హైవే రోడ్డు కుంగడంతో వాహనాలు గొయ్యిలో పడిపోయి 24 మంది మృతి చెందారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మిజౌ, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలోని కొంతభాగం బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కుంగింది. కొండప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు కిందిభాగంలోని మట్టి మొత్తం కొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. సడెన్ గా ఇలా జరగడంతో వేగంగా వచ్చిన వాహనాలు కొన్ని అందులో పడిపోయాయి.

ఒకదానికొకటి ఢీకొని అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఈ ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారు. 500 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 30 మందిని ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఎవరికీ ప్రమాదం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ‘‘రోడ్డు ఒక్కసారిగా కుంగడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది.

అందులో 20 వెహికల్స్ పడిపోయాయి. 54 మంది ప్యాసింజర్లలో  24 మంది చనిపోగా, 30 మందికి గాయాలయ్యాయి” అని అధికారులు చెప్పారు. కాగా, గ్వాంగ్​డాంగ్ ప్రావిన్స్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగానే రోడ్డు కుంగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.