గూగుల్ మాజీ సీఈఓ, బిలియనీర్ ఎరిక్ స్మిత్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 70 ఏళ్ల వయసున్న ఈ టెక్ దిగ్గజం.. తనకంటే దాదాపు 43 ఏళ్లు చిన్నదైన 27 ఏళ్ల జర్మన్ మోడల్ గ్లోరియా-సోఫీ బుర్కాండ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. గ్లోరియా మరెవరో కాదు.. జర్మనీలోని బవేరియా పొలిటీషియన్ మార్కస్ సోడర్ కుమార్తె కావడం గమనార్హం.
గ్లోరియా-సోఫీ కేవలం మోడల్ మాత్రమే కాదు.. ఆమె ఒక మేధావి కూడా. బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం న్యూయార్క్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. 'వోగ్ టర్కీ' వంటి అంతర్జాతీయ పత్రికల కవర్ పేజీలపై మెరిసిన ఆమె.. రచయిత్రిగా కూడా తన గళాన్ని వినిపిస్తోంది. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి టీన్ వోగ్ పత్రికలో ధైర్యంగా వ్యాసాలు రాసి చర్చకు దారితీసింది. అందం, తెలివితేటలు కలగలిసిన గ్లోరియా.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యున్నత రాజకీయ, వ్యాపార వర్గాల్లో చురుగ్గా తిరుగుతోంది.
అయితే ఈ డేటింగ్ వార్తలపై ఎరిక్ స్మిత్ సన్నిహితులు భిన్నంగా స్పందిస్తున్నారు. వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని.. అంతకు మించి ఏమీ లేదని వాళ్లు క్లారిటీ ఇస్తున్నారు. కానీ జర్మన్ పత్రిక 'బిల్డ్' మాత్రం ఆమె ఎరిక్ స్మిత్‌కు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువేనని నొక్కి చెబుతోంది. దాదాపు రూ.4.5 లక్షల కోట్లకు పైనే ఆస్తి కలిగిన ఎరిక్ స్మిత్, గత నాలుగు దశాబ్దాలుగా వివాహ బంధంలో ఉన్నప్పటికీ తరచూ అమ్మాయిలతో కలిసి కనిపిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ALSO READ : లైఫ్ పార్ట్నర్ కు ఇలాంటి ప్రామిస్ లు చేయండి..
గతంలో కూడా ఎరిక్ స్మిత్ తనకంటే వయసులో చాలా చిన్నవారైన మహిళలతో సంబంధాల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. మాజీ ఒలింపిక్ స్కేటర్ అలెగ్జాండ్రా డ్యూయిస్‌బర్గ్‌తో పాటు మిచెల్ రిట్టర్ అనే పారిశ్రామికవేత్తతో ఆయన నడిపిన వ్యవహారం కోర్టు మెట్ల వరకు వెళ్లింది. మిచెల్ రిట్టర్ ఆయనపై ఆర్థిక అవకతవకలు, వేధింపుల ఆరోపణలు చేయగా.. స్మిత్ వాటిని ఖండించారు. ఇప్పుడు గ్లోరియా సోఫీతో ఆయన కనిపిస్తుండటం టెక్, గ్లామర్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. 70 ఏళ్ల వయసులోనూ ఈ 'ప్లేబాయ్ బిలియనీర్' ప్రేమాయణాలు నెటిజన్లను షాక్ కి గురిచేస్తున్నాయి.
