పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరం

పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరం

హైదరాబాద్: పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ..ఇంగ్లీష్ పై మోజు వద్దని.. ఒకవేళ పరాయి భాష నేర్చుకున్నా తెలుగును మరవొద్దని చెప్పారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు బాషా అభివృద్ధి కోసం, దేశంలో భాష ప్రతీప్రదకన ప్రారంభించిపడిన రెండో  తెలుగు విశ్వవిద్యాలయం.. మన  పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం కావడం విశేషం అన్నారు. 1985 డిసెంబర్ 26న ప్రారంభమైన  సంస్థ భోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ వంటి కార్యక్రమాలతో తెలుగు బాషా సంస్కృతి, సాహిత్యాన్ని, చరిత్రను పరిరక్షించుకోవాలనే సంకల్పానికి తెలుగు విశ్వవిద్యాలయం ఒక చిరునామా అని తెలిపారు.

విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి చోరువ తీసుకొన్న కీర్తి శేషులు ఎన్టీఆర్ తెలుగు తనానిని ఒక శాశ్వత చిరునామాగా నిలిచారని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని అభిమానించడమే కాకుండా సీఎం అయ్యాక సాహిత్యని, సంస్కృతి కళలను పరిరక్షిచుకోవాలనే సంకల్పంతో అయన చేపట్టిన కార్యక్రమాలు మరువలేనివి అన్నారు. మన మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలనే సంకల్పాన్ని ముందు తరాలకు అదించే బాధ్యత తెలుగు విశవిద్యాలయంపై ఉందన్నారు. ప్రతీ రాష్టంలో పరిపాలన భాషగా రాష్ట్ర బాషా ఉండాలన్నారు. కేసీఆర్ మాతృబాషాభీమనని.. తెలుగు విశ్వవిద్యాలయానికి 100 ఎకరాలు కేటాయించడం సంతోషమన్నారు. బాషా సంస్కృతితో పాటు కలలు, హస్త కళలను ప్రోత్సాహించాలన్నారు.

అగ్లం నేర్చుకోవాలి కానీ.. అమ్మ బాషను మరవద్దని చెప్పారు. మాతృ బాషా, మాతృ భూమిని గౌరవించాలని తెలిపిన ఆయన.. బాషా గొప్పతనం తెలువాలంటే.. మన బాషా సాహిత్యలు ఇతర భాషలో ఆణువదించబడాలన్నారు. మాతృ భాషలో చదువుకున్న బహుబాషా పీవీ నర్సింహారావు దేశ ప్రధాని అయ్యారు. రైతు బిడ్డ అయినా నేను ఉప రాష్ట్రపతి అయ్యానని చెప్పారు. ఫిలిట్రేషన్ అనేది రాభోయే తరాలకు ఇన్స్పిరేషన్ అని .. కోవిడ్ ప్రజలకు జీవన విధానం నేర్పించిందన్నారు. ప్రకృతిని ప్రేమించమందని..ఎన్ని కొత్త వంటలు వచ్చినా మన పాత వంటలో ఉండే రూచే వేరని తెలుగు సాంప్రదాయాన్ని చెప్పుకొచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.