ఇక నుంచి జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్ : వెంకయ్య

ఇక నుంచి జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్ : వెంకయ్య

వైజాగ్ : జైజవాన్, జైకిసాన్ తో పాటు జై విజ్ఞాన్ కూడా చేర్చాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బుధవారం జరిగిన విశాఖలో ఎన్.ఎస్.టి.ఎల్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్య.. ఎన్ ఎస్టిఎల్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రతిభ చూపిన శాస్త్రవేత్తలకు, అధికారులకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశరక్షణ పరికరాల తయారీలో ఎన్ఎస్టిఎల్ పాత్రను కొనియాడుతూ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి చంద్రమండలంలోకే కాకుండా సూర్యమండలంలోకి కూడా అడుగుపెడతాడని తెలిపారు.

పురాతన నాగరికతకు, శాంతి కాముకతకు భారతదేశం ఒక చిహ్నమని మనదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వుండేదని.. మళ్లీ ఆరోజులు రాబోతున్నాయన్నారు. విదేశీభావజాలం నుంచి భారతీయులు బైటపడాలన్నారు. భారత్ కు ఎవరపైనా దాడి చేసే స్వభావంలేదని, ఇతరులు మన సొంత విషయాల జోలికి వస్తే గట్టిగానే బుద్ది చెపుతామన్నారు వెంకయ్య.