V6 News

బీజేపీ నేత యాదగిరి మృతి బాధ కలిగించింది

బీజేపీ నేత యాదగిరి మృతి బాధ కలిగించింది

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన బీజేపీ నేత యాదగిరి మృతి బాధ కలిగించిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. యాదగిరి తమ కుటుంలో ఒకరిగా ఉండే వారన్నారు. గోదావరిఖనిలో యాదగిరి నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు వివేక్. స్థానికులకు ఏ కష్టం వచ్చినా యాదగిరి వారి వెన్నంటి ఉండేవారని చెప్పారు. యాదగిరి లేని లోటు తీర్చలేనిదన్నారు. మేయర్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కార్పొరేటర్లు కౌశిక లత, దుబాసి లలిత, కాల్వల శిరీష, మల్లికార్జున్ యాదగిరికి నివాళులర్పించారు.