హైదరాబాద్: మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణ హాని ఉందని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విజయా రెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి.
సొంత వాళ్లే నా కుటుంబాన్ని నాశనం చేశారని.. నా అత్త అంటే విజయా రెడ్డి తల్లి, నా బామ్మర్ది చిరంజీవి, అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్లు ఒత్తిడి చేయటం వల్లే విజయారెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు తన కంప్లయింట్ లో చెప్పుకొచ్చాడు భర్త సురేంద్ రెడ్డి. నా అత్త, బామ్మర్ధి, అతని భార్య ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారని.. నా భార్య, పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. 25 రోజులకే నన్ను బెదిరించారని.. ఆస్తి కోసం వాళ్లు ఎంతకు అయినా తెగిస్తారంటూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు సురేందర్ రెడ్డి.
నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు ఉన్నారని.. నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తానంటూ వివరించారాయన. నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని.. ఆస్తి కోసం వాళ్ల కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేసిందని.. వాళ్లు చనిపోయిన 25 రోజులకే నన్ను కూడా ఆస్తి కోసం బెదిరించినట్లు తన కంప్లయింట్ లో చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.
నా అత్త అయిన విజయారెడ్డి తల్లి, నా బామ్మర్ది, అతని భార్య నుంచి నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ మేడిపల్లి పోలీసులకు రిటర్ కంప్లయింట్ రాసిచ్చారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని విజయా రెడ్డి భర్త మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. విజయా రెడ్డి భర్త గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేశాడు. విజయా రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి జనవరి 31న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.
బోడుప్పల్‌లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38), ఆమె కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) జనవరి 31న రాత్రి తమ కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని గుర్తించిన లోకో పైలట్ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం వారి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు లభించకపోవడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.
విజయ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేశాడు. వారి ఇద్దరు పిల్లలు పటాన్‌చెరులోని ఓ కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. పిల్లలను విజయ జనవరి 30న రాత్రే ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత చర్లపల్లి స్టేషన్‌కు తమ సొంత కారులో వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.
