భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో ఒక్క బాలింత మరణం సంభవించొద్దని, ఇందుకు డాక్టర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్అంకిత్ ఆదేశించారు. మాతృ మరణాలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతి మాతృ మరణ కేసును సీరియస్‌గా తీసుకోవాలని, మరణానికి దారి తీసిన కారణాలు, గర్బధారణ సమయంలో అందిన వైద్య సేవలు, రిఫరల్ వ్యవస్థ, అత్యవసర చికిత్స, ట్రాన్స్పోర్టు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
అంతకుముందు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవ జాత శిశువులకు ప్రారంభంలోనే కంటి సమస్యలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పాల్గొన్నారు.
