కంపెనీలో కార్మికులకు గంజాయి చాక్లెట్ల సప్లయ్

కంపెనీలో  కార్మికులకు గంజాయి చాక్లెట్ల సప్లయ్

కుత్బుల్లాపూర్, వెలుగు: బిహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి కార్మికులకు విక్రయిస్తున్న వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 350 గ్రాముల బరువున్న 71 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన రంజిత్ కుమార్ ఉపాధి కోసం హైద రాబాద్కు వచ్చి ఖాజీపల్లిలోని ఓ కంపెనీలో లేబర్ గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బిహార్ లోని తన అత్తగారి గ్రామం నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి దుండిగల్ తాండా2 ప్రాంతంలోని కార్మికులకు విక్రయిస్తున్నాడు. బుధవారంపోలీసులురంజిత్ కుమార్ను అదుపులోకి తీసుకుని తనిఖీచేయగా, అతని వద్ద గంజాయి చాక్లెట్లు లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.