హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను అసెస్‌మెంట్ డేటాను మరింత కచ్చితత్వంతో నవీకరించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఈ- పంచాయతీ’పోర్టల్‌లోని గ్రామ పంచాయతీ లాగిన్‌లో ఇండ్ల పన్ను వివరాలను అప్‌డేట్ చేసేందుకు నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 3
ఈ పోర్టల్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేయడానికి అవకాశం కల్పించారు. యజమాని మొబైల్ నంబరు, ఇంటి, భవనం లొకేషన్, యజమాని రకం (ఓనర్ టైప్), భూమి రకం (లాండ్ టైప్), భవనం ఉన్న స్థలానికి సంబంధించిన వివరాలు అప్ డేట్ చేసే అవకాశం కల్పించారు. డీపీవోలు తమ పరిధిలోని జీపీ కార్యదర్శులకు తగిన సూచనలు జారీ చేయాలని డీపీఎంలను ఆదేశించారు. జీపీ కార్యదర్శులు క్షేత్రస్థాయి రవాణా, భౌతిక రికార్డులను పక్కాగా పరిశీలించిన తర్వాతే ఆన్‌లైన్ లో వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది.
