‘బనకచర్ల’ టీవోఆర్‌‌‌‌‌‌‌‌ను తిప్పి పంపినం...రాజ్యసభలో కేంద్రం సమాధానం

‘బనకచర్ల’ టీవోఆర్‌‌‌‌‌‌‌‌ను తిప్పి పంపినం...రాజ్యసభలో కేంద్రం సమాధానం

హైదరాబాద్, వెలుగు: ఏపీ తలపెట్టిన పోల వరం, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను వెనక్కి పంపినట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. వాస్తవానికి గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌(ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్‌‌‌‌)‌‌‌‌ను, టీవోఆర్‌‌‌‌‌‌‌‌(టర్మ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిఫరెన్స్‌‌‌‌)ను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది. అయితే, ఇప్పుడు ఎంపీ ప్రశ్న అడగడంతో సభలో కేంద్రం సమాధానమిచ్చింది. నిరుడు జూన్​ 17న ఎక్స్‌‌‌‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఏపీ ప్రతిపాదనను పరిశీలించిందని పేర్కొంది. 

అంతర్రాష్ట్ర సమస్యలుండడంతో సెంట్రల్ వాటర్ కమిషన్ దీనిపై విశ్లేషించాల్సిన అవసరం ఉందని, పర్యావరణ ప్రభావంపై అధ్యయనానికి సీడబ్ల్యూసీ ఎన్‌‌‌‌వోసీ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని అప్రైజల్ కమిటీకి ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఏపీ ప్రతిపాదనను తిప్పి పంపామని తెలిపింది.