రాయికల్, వెలుగు: జగిత్యాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాయికల్మండలం అల్లీపూర్ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం పోరండ్ల కిరణ్, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు. బట్టు అనన్య(అండర్10) 60 మీటర్ల పరుగుతోపాటు, 300 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్, డిస్కస్ త్రో(అండర్18)లో పి.శిరీష గోల్డ్ మెడల్, ఆర్.రాహుల్(అండర్12) 400 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు. ఈ విద్యార్థులు ఈ నెల 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ ఎంబారీ గౌతమి వెంకటేశ్, టీచర్లు, గ్రామస్తులు అభినందించారు.
తాటిపల్లి గురుకుల విద్యార్థినులు
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినులు సైతం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఆర్.మనీషా(1000 మీ.), అక్షయ(షాట్పుట్), జి.యశస్విని (జావెలిన్ త్రో), కె. దేవి (600 మీ.), టి.హాస్య (బాల్ త్రో) విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను అభినందించి రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
