తెలంగాణలో వెదర్ అలర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సిస్టమ్స్..ఎంపీ రవిచంద్ర ప్రశ్నకు కేంద్రం సమాధానం

తెలంగాణలో వెదర్ అలర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సిస్టమ్స్..ఎంపీ రవిచంద్ర ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వెదర్ అలర్ట్స్ ఇచ్చేందుకు అత్యాధునిక సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతులకు పంచాయత్ మౌసమ్ సేవా పోర్టల్, వాట్సాప్, కృషి సఖీలు, పశు సఖీల ద్వారా ఎప్పటికప్పుడు వెదర్ అడ్వైజరీలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గురువారం రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర విజ్ఞాన, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

గోదావరి, కృష్ణా నదుల వరదలను ముందుగానే అంచనా వేసేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆధ్వర్యంలో 25 ఫ్లడ్ మెటీరియాలజికల్ ఆఫీసులు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఓలు) పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎస్) మానిటరింగ్ సెంటర్ పనిచేస్తోందని, తెలంగాణలో రిక్టర్ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 3.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉందని తెలిపారు.

గ్రామీణ తెలంగాణకు  24 గంటల కరెంట్..

2025-–26 ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సగటున 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సౌభాగ్య స్కీం అమలు సమయంలో రాష్ట్రంలో 5,15,084 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పీఎం-జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ స్కీం కింద పీవీటీజీ వర్గాలకు చెందిన 3,884 ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తయిందని పేర్కొన్నారు. డీఏ-జీజీయూఏ స్కీం కింద మరో 23,748 గిరిజన కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.