న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (ఐఐఎంయూఎన్) సంస్థ ముంబైలో నిర్వహించే యూత్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి వేదికను పంచుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ గురువారం ‘ఎక్స్’లో స్పందించారు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదని.. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినదన్నారు.
భగవత్ గురువారమే (6న) పాల్గొంటున్నారని.. తాను 7,8 తేదీల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా, పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్(ఎఫ్‌సీఆర్‌ఏ) బిల్లుతో ప్రభుత్వం విపరీతమైన అధికారాలను చేతుల్లోకి తీసుకుంటోందని థరూర్ ఆరోపించారు. దీనివల్ల విదేశీ నిధులతో నడిచే ఆస్పత్రులు, స్కూళ్ల వంటి సంస్థలకు ఆటంకం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
