గోదావరిఖని: పవర్ ప్లాంట్నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

గోదావరిఖని: పవర్ ప్లాంట్నిర్మాణానికి చర్యలు చేపట్టాలి
  •     సీఎస్​ను కోరిన ఎమ్మెల్యే రాజ్ ​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల సూపర్​ క్రిటికల్​ పవర్ ప్లాంట్​ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ సంజయ్​ జాజును ఎమ్మెల్యే ఎంఎస్ ​రాజ్​ఠాకూర్ కోరారు. గురువారం హైదరాబాద్​లో సీఎస్​ను కలిసి మాట్లాడారు. రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల పవర్ ప్లాంట్​స్థానంలో 800 మెగావాట్ల పవర్​ప్లాంట్​ నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

రామగుండంలో ఈఎస్​ఐ హాస్పిటల్ ​ఏర్పాటు, రైల్వే స్టేషన్లలో ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ఇందుకు సీఎస్ ​సానుకూలంగా స్పందించారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ తెలిపారు.