కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్- విద్యార్థిని కె.అద్వికానాథ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి తెలిపారు. పెద్దపల్లి ఎస్ఎన్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించగా అండర్-17 విభాగంలో కె.అద్వికానాథ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదో స్థానాన్ని సాధించింది.
