భారత జట్టులో నో ఛాన్స్.. రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ రిషబ్.. శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కిన పంత్ మావా!

భారత జట్టులో నో ఛాన్స్.. రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ రిషబ్.. శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కిన పంత్ మావా!

Rishabh Pant: రాబోయే ఇరానీ కప్ 2026-27 కోసం రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ రిషబ్ పంత్ ఈరోజు (సోమవారం, సెప్టెంబర్ 28) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ గా నిలిచిన జమ్ము అండ్ కశ్మీర్‌తో జరగనున్న ఐదు రోజుల ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్ అక్టోబర్ 1 (గురువారం) నుంచి ప్రారంభంకానుంది. భారత జట్టు త్వరలో ఆడబోయే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో, ఈ ఐదు రోజుల మ్యాచ్ రిషబ్ పంత్‌కు రెడ్-బాల్ క్రికెట్‌లో తగినంత రిథమ్, మ్యాచ్ ప్రాక్టీస్‌ను అందించనుంది.

జమ్ము అండ్ కశ్మీర్‌ తొలి ప్రదర్శన: 

ఈ ప్రతిష్టాత్మక దేశీయ ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌లో జమ్ము అండ్ కశ్మీర్ జట్టు అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా తొలిసారి ఆడబోతున్న ఇరానీ కప్ 2026-27ని సొంతం చేసుకోవాలని జమ్ము టీమ్ ప్లాన్ చేస్తుండగా.. పంత్ తనదైన వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నాడు. మరోవైపు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెప్టెంబర్ 16 నాడు 15 మంది సభ్యులతో కూడిన రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. వెన్నునొప్పి గాయం (lower-back stress injury) నుంచి కోలుకుంటున్న ఆకాశ్ దీప్ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి జట్టులో చోటు దక్కించుకున్నారు.  

ఇరానీ కప్ 2026 మ్యాచ్ వివరాలు:

* మ్యాచ్: జమ్ము & కశ్మీర్ vs రెస్టాఫ్ ఇండియా, ఇరానీ కప్ 2026-27.   
* తేదీ: గురువారం, అక్టోబర్ 1 నుండి సోమవారం, అక్టోబర్ 5, 2026 వరకు.
* వేదిక: శ్రీనగర్, జమ్ము & కశ్మీర్.   
* ఎడిషన్: 63వది.   
* రెస్టాఫ్ ఇండియా కెప్టెన్: రిషబ్ పంత్.     
* రెస్టాఫ్ ఇండియా వైస్ కెప్టెన్: సర్ఫరాజ్ ఖాన్.   
* జమ్ము & కశ్మీర్ కెప్టెన్: పరాస్ డోగ్రా.   

రెస్టాఫ్ ఇండియా జట్టు: 

రిషబ్ పంత్ (కెప్టెన్*/వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరన్ రవిచంద్రన్, మానవ్ సుతార్, 
శరన్ష్ జైన్, ఆకాష్ దీప్*, ముఖేష్ కుమార్, ముఖేష్ చౌదరి, ఆర్యన్ జుయల్ (WK), ఆర్యన్ పాండే, అనుకుల్ రాయ్, ఆయుష్ దోసెజా

►ALSO READ | షూటింగ్‌లో ఇషా సింగ్‌కు రజతం, కురాష్లో కాంస్యం.. పతకాల జోరులో భారత్!