ఇంటి వాకిట్లో వృద్దురాలి డెడ్ బాడీ.. కోరుట్లలో షాకింగ్ ఘటన

ఇంటి వాకిట్లో వృద్దురాలి డెడ్ బాడీ.. కోరుట్లలో షాకింగ్ ఘటన

కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో  మృతిచెందింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అర్బన్ కాలనీలో బత్తుల గంగానర్సు(80) కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది.

సోమవారం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది కాలనీలోని డ్రైనేజీలను శుభ్రం చేస్తుండగా దుర్వాసన రావడంతో అనుమానంతో పరిసరాలను పరిశీలించారు. కాగా ఓ ఇంటి వాకిట్లో గంగా నర్సు అనే వృద్ధురాలి డెడ్​బాడీ పడి ఉంది.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్​బాడీని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గంగానర్సుకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉండగా.. ఒక కొడుకు గతంలోనే చనిపోగా, మరో కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు.