సీఎం పర్యటనకు పటిష్ట భద్రత.. కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీతో సీఎం భద్రతా అధికారుల సమీక్ష

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత.. కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీతో సీఎం భద్రతా అధికారుల సమీక్ష

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవానికి ఈ నెల 30న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రానున్న నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రా మిశ్రా, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌష్ ఆలం, సీఎం భద్రతా అధికారులు నూతన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంగణాన్ని పరిశీలించారు.

కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలోని హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవనం, కాన్ఫరెన్స్ హాల్ పరిసర ప్రాంతాలను సీపీ, సీఎం భద్రతా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు.

భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఎం కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లే మార్గం, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియంత్రణ, పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అత్యవసర వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర అంశాలపై సమీక్షించారు. 

సమావేశంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆర్డీవో షర్మిల, సీఎంవో ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ అధికారులు ఎస్పీ రామచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, డీఎస్పీలు రఘుచందర్, శ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.