హైదరాబాద్: వరంగల్ ఎయిర్‌పోర్టుకు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని ఫోరం ప్రతినిధులు కోరారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, పాశం యాదగిరి దొడ్డి కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమురయ్య పోషించిన పాత్రకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందని సమావేశం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం కీలక ఘట్టంగా నిలిచిందని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని వారు కోరారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి, ఆయన సేవలు,త్యాగాలకు తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది.
