హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పీసీసీ కమిటీల నియామకాలపై స్టేట్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా గురువారం రెండు కీలక విభాగాలకు చైర్మన్లను నియమించారు. పీసీసీ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని, సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా నవీన్ పట్టేంను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ యంత్రాంగాన్ని యాక్టివ్ చేయడంపై ఫోకస్ పెట్టిన మహేశ్ గౌడ్.. ఏఐసీసీ ఆమోదంతో పెండింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే పలు అనుబంధ సంఘాలకు కొత్త అధ్యక్షులను నియమించిన పీసీసీ వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని కమిటీలను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
