రీతూ చౌదరి, డెమన్ పవన్ జంటగా ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ విడుదల

రీతూ చౌదరి, డెమన్ పవన్ జంటగా ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ విడుదల

రీతూ చౌదరి, బిగ్‌‌‌‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్ జంటగా నటించిన ఆల్బమ్ సాంగ్ ‘బంగారం’.  అఫ్రోజ్ అలీ కంపోజ్  చేసి, లిరిక్స్‌‌‌‌ అందించడంతో పాటు సమీరా భరద్వాజ్‌‌‌‌తో కలిసి పాడాడు.  రంజిత్ రెడ్డి సంగీతం అందించాడు. ‘బంగారం నీ కోసం నేనుంటా’ అంటూ సాగే ఈ పాటను ఇటీవల విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో డెమన్ పవన్ మాట్లాడుతూ ‘నాగార్జున గారు ఈ సాంగ్‌‌‌‌ను లాంచ్ చేసి బాగుందనడం హ్యాపీ. ఈ పాటను నిర్మించిన డీపీ క్రియేషన్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై భవిష్యత్తులో వెబ్ సిరీస్‌‌‌‌లు, సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నా’ అని చెప్పాడు.  రీతూ చౌదరి మాట్లాడుతూ ‘డెమన్ పవన్ కోసం ఈ సాంగ్ చేశా. ఎంతో ప్యాషన్‌‌‌‌తో పవన్ దీన్ని నిర్మించాడు.  పాట చాలా అందంగా వచ్చింది’ అని చెప్పింది.  సింగర్ సమీరా భరద్వాజ్, లిరిసిస్ట్ అఫ్రోజ్ అలీ, మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి, కొరియోగ్రాఫర్ విజ్జు ముదిరాజ్ పాల్గొన్నారు.