చాలాకాలంగా నీళ్లు లేని బావి.. ఒక్కసారిగా నీళ్లతో నిండిపోయింది.18 అడుగుల బావి రాత్రికిరాత్రి నిండా నీళ్లతో ప్రత్యక్షమిచ్చి షాక్ గురి చేసింది. అంతేకాదు సముద్రంలో కెరటాలు, అలలు ఎగిసిపడినట్లు ఈ బావిలో నీళ్లు కూడా పెద్దపెద్ద అలలో ఊగిపోయింది. ఏంజరిగిందో తెలియక స్థానికులు ఏం మాయ ఇది అని ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళదాం..
అది గుజరాత్ లోని మోర్బి జిల్లా వీర్ పర్దా గ్రామం. గత ఐదురోజులుగా ఉన్నట్టుంటుండి ఎడిపోయి ఉన్న బావినుంచి నీళ్లు బయటకి ఉబికి వచ్చాయి. అంతుచిక్కని అలలు, కెరటాలతో బావి ఊగిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. వీర్ పర్దా ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషలమీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
ఈ వింతకు భూకంపం కారణం కావచ్చని భావించారు స్థానికులు. సమీప ఎర్త్ కేక్ రీసెర్చ్ సెంటర్ సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే ఈ అరుదైన ఘటన కు భూకంపం కారణం కాదని అసలు నిజాన్ని చెప్పారు.
ఇది భూకంపాల వల్ల కాదు. ఎగువన కురిసిన భారీ వర్షాలకారణంగా భూగర్భ జలాలు నిండటం, రాళ్ళలోని సూక్ష్మ రంద్రాలలో చిక్కుకున్న గాలి విడుదల కావడం వల్ల ఇలా బావిలో ఈ అలజడి ఏర్పడుతున్నట్లు చెప్పారు.
ఇక ఈ వింత చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. నిండుగా ఉన్న బావిలో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలను చూసి ఆశ్చర్యపోయారు. ఏదో తెలియని శక్తి తో బావిలో ఇలా జరుగుందని అనుమానించారు. మూడు నెలల క్రితమే బావి తవ్వించాం.. ఆగస్టు2వరకు బావిలో నీళ్లు లేవు.. ఈ వింతను చూసి మేం ఆశ్చర్యపోతున్నామని బావి ఓనర్ చెప్పాడు.
భయపడాల్సిన అవసరం లేదు..
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మవద్దని అధికారులు కోరారు. సైంటిస్టుల బృందం పర్యటించివిచారణ జరుపుతుందని చెప్పారు. నీటి అడుగున ఉన్న ఎయిర్ ట్రాప్ కారణంగానే బావిలో కదలికలు జరుగుతున్నాయని జియోలాజికల్ టీం తెలిపింది.
#WATCH | Morbi, Gujarat: An unusual incident has been reported in Virparda village, Morbi taluka, where a farm well has been showing wave-like movement. The District Collector has ordered a detailed report from the groundwater research team.
— ANI (@ANI) August 7, 2026
Collector Swapnil Khare says, "...… pic.twitter.com/hnFamPfBoW
