75 సార్లు కాదు..75‌‌‌‌‌‌‌‌0 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్తారు..కేంద్రం నుంచి నిధుల కోసమే ఆయన పర్యటన: విప్ ఆది శ్రీనివాస్

75 సార్లు కాదు..75‌‌‌‌‌‌‌‌0 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్తారు..కేంద్రం నుంచి నిధుల కోసమే ఆయన పర్యటన: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి 75వ సారి ఢిల్లీ వెళ్లారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్ లెక్కలు చెప్తుండని, 75 సార్లు కాదు, అవసరమైతే 750 సార్లు కూడా ఢిల్లీకి వెళ్తారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం హోదాలో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తారని, కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు వస్తే ఆ పార్టీ సీఎంగా వెళ్తారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌లా సూట్.. బూటు వేసుకొని షో చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. 

ఆయనలా ప్రత్యేక విమానాలను వినియోగించుకోవడం లేదని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సాధారణ ప్రయాణికుడి వలే కామన్ ఫ్లైట్‌‌‌‌లోనే వెళ్తున్నారని చెప్పారు. అధికారాన్ని ఎందుకు కోల్పోయామనే విషయంపై ఆలోచన చేయకుండా, ఇంకా అధికారంలో ఉన్నట్లుగానే ఊహల్లో విహరించడం మానుకోవాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు హితవు పలికారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతిని కూడా కేటీఆర్ రాజకీయాలకు వాడుకోవడం మానుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జయ శంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ఆయన గ్రామాన్ని విస్మరించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు జయశంకర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.