పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 800 మెగావాట్ల సామర్థ్యం గల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడో దశలోని 12వ యూనిట్ బుధవారం అర్ధరాత్రి ట్రిప్ అయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగానే యూనిట్ నిలిచిపోయినట్లు కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ శివరామిరెడ్డి తెలిపారు. మరమ్మతులు పూర్తి చేసి శుక్రవారం యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని చెప్పారు.
