బ్యాంకులో ప్రాణాలొదిలిన రైతు.. కరీంనగర్ జిల్లాలో డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన రైతు

బ్యాంకులో ప్రాణాలొదిలిన రైతు.. కరీంనగర్ జిల్లాలో డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన రైతు

గన్నేరువరం, వెలుగు: బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య(65) గురువారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌‌‌‌రోడ్డు వద్ద ఉన్న ఎస్‌‌‌‌బీఐ బ్రాంచికి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. క్యాష్​ కౌంటర్ ఎదుట నిల్చున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందాడు.