పీజీ మెడికల్‌‌ కన్వీనర్‌‌ కోటా ఫీజులు తగ్గించండి..టీఏఎఫ్‌‌ఆర్‌‌సీ చైర్మన్‌‌ కు హెచ్‌‌ఆర్‌‌డీఏ  వినతి

పీజీ మెడికల్‌‌ కన్వీనర్‌‌ కోటా ఫీజులు తగ్గించండి..టీఏఎఫ్‌‌ఆర్‌‌సీ చైర్మన్‌‌ కు హెచ్‌‌ఆర్‌‌డీఏ  వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ (ఎండీ, ఎంఎస్) కన్వీనర్‌‌ కోటా ఫీజులను తగ్గించాలని హెచ్‌‌ఆర్‌‌డీఏ కోరింది. 2023–26 బ్లాక్ పీరియడ్‌‌ ఫీజులను పునసమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్‌‌సీ) చైర్మన్‌‌ ను కలిసి వినతిపత్రం సమర్పించింది.

ప్రస్తుతం ఎంబీబీఎస్‌‌ లో కన్వీనర్ కోటా ఫీజు ఏడాదికి రూ. 60 వేలే ఉందని, మేనేజ్‌‌ మెంట్ కోటా ఫీజు రూ. 11.55 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు ఉందని నేతలు తెలిపారు. పీజీలోనూ ఇదే విధానాన్ని అమలు చేసి మెరిట్ విద్యార్థులకు ఫీజులు తగ్గించే చాన్స్​ ఉందని పేర్కొన్నారు.