- కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ నాన్- మైనార్టీ డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజీలో ఎండీఎస్ (పీజీ డెంటల్) కోర్సు ఫీజులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఖరారు చేసింది. 2026–2029 బ్లాక్ పీరియడ్ కు సంబంధించి ఫీజుల వివరాలను రిజిస్ట్రార్ వెల్లడించారు.
జీవో నం. 124 ప్రకారం.. 2023–2026 బ్లాక్ పీరియడ్ లో ఉన్న పాత ఫీజులే యథాతథంగా కొనసాగుతాయి. గత జీవోలోని నిబంధనలు, షరతులన్నీ వీటికి కూడా యథావిధిగా వర్తిస్తాయి. ఇదే టైంలో 2026–2029 మధ్య ప్రభుత్వం లేదా వర్సిటీ నుంచి కొత్తగా గుర్తింపు పొందే కాలేజీలకు మాత్రం జీవోలో పేర్కొన్న అతి తక్కువ ఫీజు వర్తిస్తుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
