ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా..రూ.15 లక్షలు మంజూరు

ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా..రూ.15 లక్షలు మంజూరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో పోరాడిన ఉద్యమకారుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఉద్యమ టైంలో ఫ్రీగా భోజనాలు, టిఫిన్లు అందిస్తూ, ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటూ చైతన్యం నింపిన హనుమకొండ జిల్లా పోస్టల్ కాలనీకి చెందిన దివంగత లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు.

అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కోటా కింద భూపాలపల్లి జిల్లా గొర్లవీడుకు చెందిన మండల రాజు తండ్రి మండల సమ్మిరెడ్డికి రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.