నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో, బంధువుల ఇళ్లలో ACB రైడ్స్

నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో, బంధువుల ఇళ్లలో ACB రైడ్స్

హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరిడెంటెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసం, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేసింది.

డాక్టర్ లక్ష్మి భాస్కర్ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేసింది. ఏసీబీ అధికారులు మూడు జిల్లాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాల్లో అక్రమార్కులు రోజుకొకరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు.

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైడా అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌(ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కలకుంట్ల కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరుకు సంబంధించి ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ను నాలుగు నెలలుగా తిప్పుతూ రూ.25 వేల లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆమె తన కొడుకుకు విషయం చెప్పగా అతను ఏసీబీని ఆశ్రయించారు. ప్లాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.15 వేలకు డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకొని సీతారాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ సమీపంలోని ఒక కుల సంఘం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎస్పీ సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం వారిని రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.  తరువాత వారిద్దరిని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు.