హైదరాబాద్, వెలుగు: భారతీయ కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆదాయాలు 10 క్వార్టర్ల గరిష్ట స్థాయికి చేరడంతో మార్కెట్లో నూతన ఉత్సాహం నెలకొందని ప్రభుదాస్ లీలాధర్(పీఎల్) పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ ఆగస్టుపీఎంఎస్ రిపోర్ట్ తెలిపింది.
దీని ప్రకారం.. పారిశ్రామిక, లోహ, ఆర్థిక రంగాలు ఈ వృద్ధికి ప్రధాన కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, ద్రవ్యోల్బణ సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ పటిష్టంగా ఉంది. ఎఫ్ఐఐలు తిరిగి మార్కెట్లోకి భారీగా తరలివచ్చారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ పరిణామాలు ఎంతో అనుకూలం. ఆగస్టులో పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన వివిధ పథకాలు రాణించాయి.
ఆక్వా పీఎంఎస్ పథకం 3.07 శాతం లాభపడింది. బీఎస్ఈ 500 సూచీ -0.09 శాతం వెనుకబడింది. ఆటమ్ పీఎంఎస్ అత్యధికంగా 9.9 శాతం రాబడిని సాధించింది. ట్రినిటీ పథకం 8.6 శాతం, ఎలివేట్ పథకం 8.8 శాతం, లీప్ పథకం 3.5 శాతం లాభంతో దూసుకెళ్లిందని రిపోర్ట్ తెలిపింది.
