ముంబై: క్రూడాయిల్ ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం 564.03 పాయింట్లు (0.76శాతం) పెరిగి 74,858.99 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 692 పాయింట్లు లాభపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67.90 పాయింట్ల (0.29శాతం) పెరిగి 23,414.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ అత్యధికంగా 4.11శాతం పెరగగా, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు కూడా రాణించాయి. భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.35శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ 0.05శాతం స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ బ్యారెల్ ధర సోమవారం 2.36శాతం తగ్గి 101.4 డాలర్లకు చేరడంతో మార్కెట్ పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం నికరంగా రూ.576 కోట్ల షేర్లు అమ్మారు.
