బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేర్ లో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేడు దిగువనున్న ఎల్ఎండీ రిజర్వాయర్ కు 2 వేల క్యూసెక్కులను విడుదల చేయనున్నారు.
మొదట 500 క్యూసెక్కులు విడుదల చేసి క్రమంగా 2 వేలకు పెంచుతామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. దిగువ గ్రామాల ప్రజలు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
