గడచిన రెండు వారాలుగా బంగారం రేట్లు తగ్గిన దాని కంటే పెరిగిందే ఎక్కువ. ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ముందుకు సాగుతున్న వేళ బులియన్ మార్కెట్లలో మళ్లీ తిరిగి డిమాండ్ పుంజుకుంటోందని, అదే ఈ పరిస్థితులకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై బెట్ వేసేందుకు తిరిగి సిద్ధం అవుతుంటడంతో రిటైల్ కొనుగోలుదారులకు పెరుగుతున్న రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి ఇండియాలో. మీరూ వీకెండ్ షాపింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ సమీప నగరాల్లోని పెరిగిన రేట్లను పరిశీలించండి ముందుగా.
ఆగస్టు 7న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.16 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 989గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 740గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 7, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పు లేకుండా రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.
