మమ్మల్ని అణచివేయాలని చూస్తే పతనం తప్పదు.. సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో ఎమ్మెల్యే కూనంనేని

మమ్మల్ని అణచివేయాలని చూస్తే  పతనం తప్పదు.. సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో ఎమ్మెల్యే కూనంనేని
  • కాంగ్రెస్ పార్టీ తన శవపేటికను తానే యారుచేసుకుంటోంది
  • కూనంనేని సాంబశివరావు

మణుగూరు, వెలుగు : ‘కాంగ్రెస్ పార్టీ తన పతనాన్ని తానే కోరుకుంటోంది.. మమ్మల్ని అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పతనం తప్పదు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రజా చైతన్య యాత్రను గురువారం పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నా ఆ పార్టీ మాత్రం తమను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.

 సీపీఐ, టీడీపీ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మిత్రధర్మాన్ని విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలు రాకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ తో కొనసాగుతున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగాలని కోరుకుంటున్నామని అన్నారు. 

అనంతరం మణుగూరు మండలం రామానుజవరంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాబీర్ పా, ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర రావు, కమటం వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీకుమారి, పుల్లారెడ్డి, రాంగోపాల్, దుర్గ్యాల సుధాకర్ పాల్గొన్నారు.