తుమ్మిడిహెట్టికి రూ.12 వేల కోట్లు..ప్రభుత్వానికి తుది పీఎఫ్‌‌ఆర్‌‌ను సమర్పించిన ఆర్వీ కన్సల్టెన్సీ

తుమ్మిడిహెట్టికి  రూ.12 వేల కోట్లు..ప్రభుత్వానికి తుది పీఎఫ్‌‌ఆర్‌‌ను సమర్పించిన ఆర్వీ కన్సల్టెన్సీ

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమికంగా తేలింది. ప్రాజెక్ట్​ప్రి ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్‌‌ఆర్‌‌‌‌)లో ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ ఈ మేరకు వెల్లడించింది. తాజాగా ఫైనల్ పీఎఫ్‌‌ఆర్‌‌‌‌ను ప్రభుత్వానికి సమర్పించింది. వాస్తవానికి రెండువారాల క్రితమే పీఎఫ్‌‌ఆర్‌‌‌‌ను ఆర్వీ సంస్థ సమర్పించినా హైడ్రాలజీకి సంబంధించిన మార్పులతోపాటు ప్రాజెక్టు వ్యయంపైనా వివరాలు పొందుపరచాలని ప్రభుత్వం సూచించడంతో.. తాజాగా తుది నివేదికను సంస్థ సమర్పించింది. 

అందులోనే బ్యారేజీల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కావాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. ప్రాజెక్టును రెండు బ్యారేజీలుగా నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకటి వార్ధా నదిపై.. మరొకటి వెయిన్‌‌ గంగ నదిపై నిర్మించి రెండింటినీ అనుసంధానించేలా కాంక్రీట్​బండ్‌‌ను నిర్మించాలని పీఎఫ్‌‌ఆర్‌‌‌‌లో పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలించేలా అలైన్‌‌మెంట్‌‌ను ఖరారు చేసింది.